Posts

సెక్యులరిజం - నిజం - మానవ నైజం

Image
Secularism in India  means equal treatment of all religions by the state. With the 42nd Amendment of the Constitution of  India  enacted in 1976, the Preamble to the Constitution asserted that  India  is a  secular  nation. ప్రతి ఆదివారం మిత్రుడు చర్చికెళతాడు ! మరో మిత్రుడు ప్రతి శుక్రవారం మసీదుకెళతాడు . నాకు   కుదిరినప్పుడు నేను గుడికెళతాను . అదిగో నామం పెట్టావ్ ! గుడికెళ్ళావ్ ! మతం పాటిస్తున్నావ్ ! నువ్వు సెక్యులర్ కాదు అని ఒకటే గగ్గోలు . ఈ చిన్ని బుర్రకి లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నానో తెలియట్లేదు . ఊహ తెలిసినప్పటినుంచి అసంకల్పిత సానుకూల చర్యలా తల్లిదండ్రుల్ని వాళ్ళు బతికున్నంతవరకూ ఫాలో అయ్యాను . ఈయన మీ నాన్న అని అమ్మ ఎలా చెప్పలేదో ( నాకు తెలిసి ఏ తల్లి చెప్పాల్సిన అవసరం రాదు ) మనం పాటించేది హిందూ మతం అంటార్రా అని అమ్మ కూడా చెప్పలేదు . మీరు ఇంగ్లీషులో ఉన్నself-help పుస్తకాలు చదవండి . వాటిలో ధారాళంగా బైబిల్ నుండి ఉదహరిస్తారు . ఎందుకంటే అవి అధిక శాతం అమేరికానుంచి ది...